Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జెర్సీ' తమిళ .. హిందీ రీమేక్ హక్కుల కోసం పోటీ

  • తెలుగులో విజయవంతమైన 'జెర్సీ'
  • సినిమా చూడాలనుకుంటోన్న కరణ్ జొహార్ 
  • తమిళ రీమేక్ రైట్స్ కోసం రంగంలోకి లైకా ప్రొడక్షన్స్
నాని కథానాయకుడిగా నటించిన 'జెర్సీ' .. ఈ నెల 19వ తేదీన విడుదలై, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కథాకథనాలు .. పాత్రలను మలిచిన తీరులో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రంగా 'జెర్సీ'ని గురించి చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకోవాలనే ఆలోచనలో దిల్ రాజు వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఈ స్థాయి సక్సెస్ ను సాధించిందని తెలుసుకున్న కరణ్ జొహార్ కూడా ఈ సినిమా చూడటానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు. ఈ సినిమా నచ్చితే అపుడు ఆయన రీమేక్ రైట్స్ విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ఇక లైకా ప్రొడక్షన్స్ వారు తమిళ రీమేక్ రైట్స్ ను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారట. అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి 'జెర్సీ' రీమేక్ హక్కుల కోసం గట్టిపోటీనే వున్నట్టుగా తెలుస్తోంది.    
nani
shraddha srinath

More Telugu News